గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన అనుచరులను సిబ్బందిగా నియమించుకున్నారు. ఇప్పుడు వారి ద్వారానే ప్రభుత్వంపై బురదజల్లేలా ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.