శేరిలింగంపల్లి: ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మదీనాగూడా ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న హరీష్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో కాలేజీ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. రికార్డుల నిర్వహణ కోసం పర్సనల్ నెంబర్ ఇవ్వాలని, లేదంటే చంపుతానని బెదిరించారని విద్యార్థినులు ఎస్సై దృష్టికి తీసుకువచ్చారు.