మూసీ నది సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయాలకు తెర లేపిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ హయాంలో హైదరాబాద్‌ను మురికి నీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ మురుగు శుద్ధి కేంద్రాలను ప్రారంభించామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. బుధవారం మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు.