చౌదరీగూడా మండలం వీరసముద్రంలో జాతీయ బీసీసేన గ్రామకమిటీ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. మండల అధ్యక్షురాలు ప్యాట జయ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ కమిటీ ఎన్నికకు ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ పాల్గొన్నారు. బీసీసేన కమిటీ మహిళా అధ్యక్షురాలిగా జానంపేట యాదమ్మ ఉపాధ్యక్షురాలిగా పర్వతాపురం యాదమ్మ, ప్రధాన కార్యదర్శిగా కవిత, కార్యదర్శిగా టి. యాదమ్మ, కోశాధికారిగా మంజులను ఎన్నుకున్నారు.