షాద్‌నగర్: బీజేపీ పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు నుస్రత్ బేగం ధ్వజం

71చూసినవారు
షాద్‌నగర్: బీజేపీ పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు నుస్రత్ బేగం ధ్వజం
పేదలను దూషిస్తారు. రాజులను పోషిస్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తారు. మహనీయులను తిట్టిపోస్తారు. ఇలాంటి భారతీయ జనతా పార్టీ పాలనలో సామాన్యుల జీవితం మతవిద్వేషాల నడుమ నలిగిపోతుందని కాంగ్రెస్ కొత్తూరు మండల మహిళా నాయకురాలు నుస్రత్ బేగం మండిపడ్డారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని ఈడెన్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

సంబంధిత పోస్ట్