గత ప్రభుత్వంలో స్వార్ధ ప్రయోజనాల కోసం విజయ డెయిరీనీ నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విజయ డైరీని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. విజయ డెయిరీ పాడి రైతుల పాల బిల్లుల బకాయిలు 50 కోట్లు విడుదల చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ ను స్థానిక పాడి రైతులు బుధవారం ఘనంగా సన్మానించారు.