దొంగల చాతుర్యం అనుకోవాలా, బాధితుల నిర్లక్ష్యం అనుకోవాలి తెలియలేదు. కానీ అందరూ చూస్తుండగానే క్షణాల్లో ఓ స్కూటీని దొంగ చాకచక్యంగా దొంగిలించాడు. షాద్ నగర్ పట్టణంలోని పరమేశ్వర థియేటర్ రోడ్డులో సంధ్యా కిరాణా షాపులో ఓ యువకుడు స్కూటీ ఆపి సామాన్లు తీసుకుంటుండగా ఓ వ్యక్తి ఆ స్కూటీకి తాళం చూసి రెండు చక్కర్లు కొట్టి మూడో చక్కర్లో దర్జాగా స్కూటీపై ఎక్కి పరారైన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.