రంగారెడ్డి జిలా షాద్‌నగర్ నియోజకవర్గం రాఘవేంద్ర ఐటీఐ కాలేజ్ సమీపంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. ఓ ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకుడు అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో డీసీఎం టైర్ల కింద పడినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో యువకుడు తల భాగానికి తీవ్ర గాయాలవడంతో స్పాట్‌లోనే మృతి చెందినట్లు ప్రత్యక్షదారులు తెలిపారు.