రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడా మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లాల్ పహాడ్ నుండి చౌదర్ గూడ మండలం వెళుతున్న ఆటో తుమ్మలపల్లి గేటు వద్ద ఒక్కసారిగా బోల్తాపడింది. దీంతో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య అనే వ్యక్తి మృతిచెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.