ప్రస్తుతం హైడ్రా తరహాలోనే షాద్ నగర్ పట్టణ కేంద్రంలో వీరమోని చెరువు అలుగునీటికి అడ్డంగా కట్టిన ప్రహరీ గోడలను అధికారులు బుధవారం బద్దలు కొట్టడంతో సంచలనం రేకెతిస్తుంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే శంకర్ అక్రమాలపై హైడ్రాతరహాలు తాను కూడా స్పందిస్తానని మీడియా సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక అనుమతి తీసుకుంటానని అప్పట్లో చెప్పారు. ఇంకా ఎక్కడెక్కడ కూల్చివేతలు జరుగుతాయో తెలియాల్సి ఉంది.