హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గతంలో కిడ్నీ మార్పిడి విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారికి స్టార్ హాస్పిటల్ నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ డిపార్ట్‌మెంట్ వైద్యులు డాక్టర్ మాలకొండయ్య,డాక్టర్ జ్యోత్స్న మరియు డాక్టర్ శ్రీధర్ సన్మానించారు.. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ కిడ్నీ వ్యాధికి గురికాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అనంతరం డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కిడ్నీ మార్పిడికి అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉందని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి మూడుసార్లు కిడ్నీ మార్పిడి విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా సరైన సమయంలో కిడ్నీ చికిత్సలు పొందితే సరిపోతుందని ఆయన అన్నారు..