T-Hubలో కలకంటి సునీత సందీప్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

52చూసినవారు
T-Hubలో కలకంటి సునీత సందీప్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
హైదరాబాద్,నాచారంకు చెందిన తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న కలకంటి సునీత సందీప్ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27,2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని కలకంటి సునీత సందీప్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా కలకంటి సునీత సందీప్ మాట్లాడుతూ "తెలుగు AI బూట్ క్యాంప్‌ తన వృత్తి జీవితంలో ఒక కొత్త మలుపును తీసుకొచ్చిందన్నారు. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా తన సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. ఈ శిక్షణ తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నా విధుల్లో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండాకి హృదయపూర్వక ధన్యవాదాలు!" అని తెలిపారు. తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1వ తారీఖున మొదలవ్వనుంది.

సంబంధిత పోస్ట్