T-Hub లో టి. శ్రుతి రెడ్డికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

85చూసినవారు
T-Hub లో టి. శ్రుతి రెడ్డికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
ప్రముఖ లైఫ్ స్కిల్స్ కోచ్ మరియు ICISC అధ్యక్షురాలైన టి.శ్రుతి రెడ్డి ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్ ను విజయవంతంగా పూర్తిచేశారు. మార్చి 9న, హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వర్ రావు, నికీలు గుండా, అభిషేక్ బొడ్డు, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని టి.శ్రుతి రెడ్డికి పట్టా అందజేశారు. ఈ 21-రోజుల బూట్ క్యాంప్లో AI టూల్స్, వ్యాపార అభివృద్ధి, క్రియేటివ్ డిజైన్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల్లో లోతుగా శిక్షణ పొందారు. AI బూట్ క్యాంప్ అనుభవాన్ని పంచుకుంటూ టి. శ్రుతి రెడ్డి మాట్లాడుతూ "నికీల్ గుండా బోధన తమ జీవితాల్లో కొత్త మార్గాలు చూపించిందన్నారు. AI టూల్స్‌ను నేర్చుకోవడంతో పాటు, వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో, డిజిటల్ మార్కెట్‌లో ఎలా ఎదగాలో స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ఈ శిక్షణ నాకు ప్రొఫెషనల్ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది." అని పేర్కొన్నారు.వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.

సంబంధిత పోస్ట్