తార్నాకలో రోడ్లపై కుల గణన సర్వే దరఖాస్తులు దర్శనం ఇస్తున్నాయని స్థానికులు తెలిపారు. రోడ్లపై వెళ్లే వారు ఆ దరఖాస్తులను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలతో కూడిన దరఖాస్తులు ఇలా రోడ్డుపై పడటానికి గల కారణాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సమగ్ర కుటుంబ కుల గణన సర్వే చేస్తుందని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నమ్మకం సన్నగిల్లుతోందని స్థానికులు అంటున్నారు.