తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో స్వీట్ పంచుకుకొని టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ స్వస్తి పలుకుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, దామోదర రాజనర్సింహ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.