అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కు కార్పొరేటర్ వినతిపత్రం

74చూసినవారు
అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కు కార్పొరేటర్ వినతిపత్రం
రామంతాపూర్ డివిజన్ అభివృద్ధి కి తోడ్పాటు అందించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఇందిరా నగర్ శేఖర్ బస్తి నుంచి గంగమ్మ దేవాలయం వరకు నూతన రోడ్డు, ఇందిరా నగర్ నుంచి నేతాజీ నగర్ వరకు డ్రైన్ పనులను చేపట్టాలని ఎమ్మెల్యే కోరామని ఆమె తెలిపారు. వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్