జలమండలి అధికారులతో కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ సమీక్ష

66చూసినవారు
జలమండలి అధికారులతో కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ సమీక్ష
నాచారం డివిజన్లోని పలు భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సరఫరా విషయం పై డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ జలమండలి జనరల్ మేనేజర్ తో సమీక్షించారు. ప్రధానంగా నాచారం ఓల్డ్ విలేజ్లో దాదాపుగా పూర్తికావచ్చిన భూగర్భ డ్రైనేజీ పనులు ఇంకొద్దిగా మిగిలి ఉండడంతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో మెరుగుపరచాల్సిన మంచినీటి సమస్యలను కూడా జిఎం దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్