దేశ సామాజిక న్యాయం సాధనకు గొప్ప కృషి చేసిన డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం హబ్సి గూడ చౌరస్తాలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రావు విగ్రహా ఆవిష్కరణలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎమ్మార్పీస్ అధినేత మంద కృష్ణ మాదిగతో కలిసి పాల్గొనడం జరిగింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిది అని ఎమ్మెల్యే అన్నారు.