గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు

6చూసినవారు
ఏపీ లోని సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న ఇద్దరిని ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. కరీంనగర్ కు చెందిన అభిజిత్, రుకేష్ అనే ఇద్దరు వ్యక్తులు కేజీ మూడు వేల చొప్పున డ్రై గంజాయి తీసుకువచ్చి ఉప్పల్, చిలుకానగర్, నాచారం పరిసర ప్రాంతాలలో అమ్ముతున్నారని ఉప్పల్ సీఐ ఓంకార్ తెలిపారు. నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో గంజాయి అమ్ముతుండగా విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద మూడున్నర కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్, ఒక బైక్ ను స్వాధీనం చేసుకొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్