ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు కాంక్రీట్ మిల్లర్ల ఓనర్లు, మేస్త్రీల ఆందోళన చేపట్టారు. ఆర్టీవో అధికారుల మంటూ తమ బండ్లను ఆపి అక్రమంగా వసూలు చేస్తున్న నకిలి ఆర్టీవో అధికారులు. గురువారం ఉదయం నకిలీ ఆర్టీవో అధికారిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన బాధితులు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సంవత్సర కాలంగా తమ వద్ద అక్రమంగా ప్రతిరోజు వేల రూపాయలు వసూలు చేస్తూ తమను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.