నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ లో మీర్పేట్ లో ఒక ఇంటిలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్నానం చేయడానికి బకెట్ లో హీటర్ పెట్టి బయటకు వెళ్ళాగా వచ్చేసరికి అగ్ని ప్రమాదం జరిగింది. హీటర్ పెట్టిన సమయంలో ఎవరు ఇంట్లో లేకపోవడంతో ప్రాణం నష్టం ఏం జరగలేదు. అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు ఫైర్ ఆఫీసుకు ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ తో మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.