మేడిపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేముల కేశవ నాదము గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లయన్ దాస నర్సయ్య 47వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. క్లబ్ అధ్యక్షులు లయన్ వేముల నాదం గౌడ్ పర్యవేక్షణ లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలోని ఇన్‌పేషెంట్ అటెండర్లకు ఆహారాన్ని పంపిణీ చేశారు.