మల్లాపూర్ లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణి

74చూసినవారు
గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మల్లాపూర్ డివిజన్ మైనారిటీ లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లను బుధవారం పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా మహిళా మైనారిటీ సోదరీమణులు తమకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేసి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప్పల్ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్