హైదరాబాద్ లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7. 5KM మెట్రో విస్తరణ కోసం భూ సేకరణ, భవనాల కూల్చివేత పనులు శరవేగంగా సాగుతున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం వివరించారు. మొత్తం 1100 ఆస్తులను గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు 205 నిర్మాణ ఆస్తులను కూల్చివేసినట్లు తెలిపారు. ఇందుకు రూ. 212 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించారు. మెట్రో రైల్ ఇంజనీర్లు దగ్గరుండి మరి పనులు పరిశీలిస్తున్నారు.