దాదాపు ఇరవైమూడేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారం వెస్లీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ 2001-2002 సంవత్సరంకు సంబంధించిన విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని మస్తాన్ మిత్రబృందం ఆధ్వర్యంలో శుక్రవారం మల్లాపూర్ స్వాగత్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.