తీవ్ర అనారోగ్యంతో బోడుప్పల్ RBM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్‌ను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, మెరుగైన వైద్యం అందించాలంటూ డాక్టర్లను ఆదేశించారు. ఫిష్ వెంకట్ తెలుగు యాసలకు గొంతుకగా నిలిచిన వ్యక్తి అని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.