ఉప్పల్ డివిజన్ పద్మావతి కాలనీ లోని పోచమ్మ ఆలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమం లో పద్మావతి కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , సముద్రాల నవీన తదితరులు పాల్గొన్నారు.