పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ లో నూతన సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్డు నిర్మాణ పనులు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ అమర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి హాజరయ్యారు. స్థానిక కాలనీ ప్రజల సమక్షంలో వారు లాంఛనంగా రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.