ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మేడిపల్లి పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ మేడిపల్లి నేతృత్వంలో పోలీస్ సిబ్బంది మేడిపల్లి మెయిన్ రోడ్డులో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా పోలీసులు ఆర్టీసీ బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తున్న వారిని, వారి లగేజీ, వస్తువులు, బ్యాగ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మేడిపల్లి మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాల పై నిఘా ఉంచాలని కోరారు.