హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్, LB నగర్, హబ్సిగూడ, హయత్‌నగర్, చైతన్యపురి, సరూర్‌నగర్, వనస్థలిపురం, నాగోల్, బషీర్ బాగ్, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పిడుగులతో వాన పడుతుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.