జేకే నగర్ ఇళ్ల సమస్య పరిష్కరించండి
By Vikram Goud 75చూసినవారుకాప్రా సర్కిల్ జమ్మిగడ్డ పరిధిలోని జేకే కాలనీలోని ఇళ్ల సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మందముల పరమేశ్వర్‌రెడ్డిని కోరారు. జేకే కాలనీవాసులు మంగళవారం ఉప్పల్‌లో పరమేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్టుగా ఈ సందర్భంగా పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు.