VIDEO: పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి, 15 మందికి గాయాలు
AP: తూర్పు గోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామ శివారులో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి ఓ బాణసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. 10 మందికిపైగా పాక్షికంగా గాయాలయ్యాయి. పిడుగుపడి బాణసంచా తయారీ కేంద్రం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.