తార్నాక: జల్సాలకు అలవాటు పడి వరుస చోరిలు.. ఆరెస్ట్

77చూసినవారు
దొంగతనాలు చేయడం లో సెంచరీ పూర్తి చేశాడు ఓ శంకర్ నాయక్ అనే దొంగ. జల్సాలకు అలవాటు పడి వరుస చోరిలకు పాల్పడుతున్న యువకుడిని ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఓయూ పీఎస్ పరిధిలో జరిగిన చొరిపై పిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఎల్బి నగర్ లో ఉన్న శంకర్ నాయక్ తో పాటు మరో వ్యక్తి ని అదుపులోకి తీసుకొని విచారించారు. బీఫార్మసీ పూర్తి చేసిన శంకర్ నాయక్ జల్సాలకు, ఆడంబరమైన జీవితం కోసం చోరీలకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్