ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షల ఫీజును ఈ నెల 26 వరకు స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ శుక్రవారం తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) తదితర కోర్సుల నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజులను ఈ నెల 26వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని పేర్కొన్నారు.