డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదివారం మొక్కలు నాటారు. తార్నాక డివిజన్ లో లాలాపేట్ లో బూత్ అధ్యక్షుడు ఇంటి వద్ద శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం మొక్కలు నాటారు. రాంచందర్ రావు తో పాటు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు జి. భరత్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.