మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్నా సందర్భంగా తార్నాక లోని ఆయన నివాసం వద్ద ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు ఆశీర్వచనం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుండి బారి ర్యాలీ గా బయలు దేరారు. ఉస్మానియా యూనివర్సిటీలో సరస్వతి దేవాలయం లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గా బాధ్యతలు స్వీకరించనున్నారు.