ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ ను కొనసాగించి నక్సలైట్లను ఎరివేయాలని ఓయూలో ఫ్ల కార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నాయకుడు పృథ్వి మాట్లాడుతూ దేశానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవుల్లో తుపాకి పట్టుకొని రక్తపాతాన్ని సృష్టిస్తున్న నక్సలైట్లకు ఈ దేశంలో ఉండే హక్కు, ఈ దేశం గాలి పీల్చే హక్కు లేదన్నారు.