పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి శుక్రవారం అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమలను అరికట్టవచ్చని చెప్పారు. నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా తార్నాక డివిజన్ లోని పలు కాలనీలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు.