తెలంగాణలోని 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లు ఓయూ పరిపాలన భవనం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసేంతవరకు ఉద్యమం చేస్తామన్నారు ఏప్రిల్ 16వ తేదీన ఇంద్ర పార్క్ వద్ద 12 యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లు మహా ధర్నా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతారని తెలియజేశారు.