ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రధాన లైబ్రరీ వద్ద డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్, జ్యోతిబాపూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఓయూ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబెడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ అంబేద్కర్ జ్యోతిబాపూలే రీసెర్చ్ సెంటర్ పైన విద్యార్థులకు ఫెలోషిప్ లు ఇవ్వాలని కోరారు.