ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిల్కానగర్ న్యూ రామ్ నగర్ ప్రాంతానికి సంబంధించిన ఆరాధ్య అనారోగ్య సమస్యతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేపించాలని కాంగ్రెస్ పార్టీ చిల్కానగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు తెలియజేయడంతో. అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద ఎల్ ఓ సీ ద్వారా 1, 50, 000మంజూరు చేయించారు. శనివారం ఎల్ ఓ సీ పత్రాన్ని వారి కుటుంబసభ్యులకు ఉప్పల్ నియోజకవర్గం ఇన్ చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అందజేశారు.