పెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలని వామపక్ష పార్టీలు శనివారం డిమాండ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్ నాగోలులోని మెట్రో ప్రధాన కార్యాలయం ముందు సీసీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎస్‌యూసీఐ, ఎంసీపీఐ పార్టీలు సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. మెట్రో నష్టాలకు యాజమాన్య తీరే కారణమని ఆయా పార్టీ నాయకులు అన్నారు.