కాళేశ్వరం కుంగినదే నిజమని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా మార్చారని, కొత్త టెండర్లు లేకుండా పాతవారికే కొనసాగించారని విమర్శించారు. అంచనాల పెరుగుదలపై పీసీ ఘోష్ విచారణ చేయాలని కోరారు. గత ప్రభుత్వ అవినీతిని కూడా కాంగ్రెస్ బయటపెట్టాలని, స్థానిక ఎన్నికలు జరగకపోవడం తప్పని, ఈసారి కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమన్నారు.