కేంద్రప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరుమీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థులు ఏర్పాటు చేసిన శాంతి చర్చలు మేధో స్పందన అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ జస్టిస్ చంద్ర కుమార్ లు పాల్గొనీ మాట్లాడుతూ ఆపరేషన్ వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.