వికారాబాద్ పట్టణంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఆదివారం మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ సందర్శించారు. ఆమె మాట్లాడుతూ. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలో సుమారు 1300 కుక్కలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని అన్నారు. వాటన్నిటికీ సర్జరీలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.