వికారాబాద్‌లో మున్నూరు సోమారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల శిరీషపై పైకప్పు నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. పెచ్చులు చిన్నారి తల, చెవి, కాళ్లపై పడడంతో శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన ఆ పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి ఆ అమ్మాయిని 'మా శారద హాస్పిటల్' వికారాబాద్‌కు తరలించగా, డాక్టర్ రాజశేఖర్ ఆ బాలికకు చికిత్సను అందిస్తున్నారు.