ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్

83చూసినవారు
ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెండ్
ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ఎంపీడీవో జర్నప్ప గురువారం తెలిపారు. మండల పరిధిలోని ఓంలా నాయక్ తండా పంచాయతీ కార్యదర్శి వెంకట చైతన్య, ఇందూర్ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ఇరువురిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వెంకట చైతన్య విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని, కిషోర్ అనుమతి లేకుండా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడంతో సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్