వికారాబాద్ మండలం సర్పన్ పల్లి ప్రాజెక్ట్ సమీపంలోని వెల్డర్ నెస్ రిసాట్ కు హైదరాబాద్ కు చెందిన రీటా కుమారి(55), పూనమ్ సింగ్(56) శనివారం విహారయాత్రకు వచ్చారు. విహారయాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రాజెక్ట్ లో బోటింగ్ చేస్తుండగా బోట్ ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.