వికారాబాద్ బోటు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ది వైల్డర్ నెస్ రిసార్ట్, బోటింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బోటింగ్ నిర్వహకులు టూరిస్టులకు లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వలేదని తేలింది. కాగా సర్పన్ పల్లి చెరువులో బోటింగ్ కు వెళ్లగా బోట్ నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు మహిళలు రీటా కుమారి (55), పూనం సింగ్ (56) అపస్మారక స్థితికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.