వికారాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

71చూసినవారు
వికారాబాద్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ శుక్రవారం అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయని వివరించారు.

సంబంధిత పోస్ట్